పుట:Ecchini-Kumari1919.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర క ర ణ ము 1,

5

పురుషునిసాయమున నాపంది నతికష్టముతోఁ దిరుగవేసెను. బాణ మింకను దానిశరీరమును నాఁటుకొనియే యుండెను. ఆ వీరుఁడు దాని నూడఁదీయవ లెనని కదల్చి చూచెను. కాని, యది కదలలేదు. ఆ బాణమును బ్రయోగించిన వీరుని బలమున కతఁ డ చ్చెరువొందెను. అతఁడు తనయావచ్ఛక్తిని వినియోగించి లాగఁబోయెను. కాని, యది యూడి రాలేదు. తాను వేసిన బాణముకంటె నది యాపందిశరీరమును గాఢముగా నాఁటుకొన్నదని యావీరునకు బోధపడెను. తనబలముకంటె నావీరుని బలము హెచ్చని గ్రహించెను. అతఁ డచ్చెరుపాటుతో మరల నా బాణములపిడిని బట్టుకొని యిట్టటు కదలించి యావచ్ఛక్తిని వినియోగించి లాగెను. ఎట్టయిన నేమి యాబాణ మూడివచ్చెను. అది రక్తముతోఁ దడిసియుండెను. ఆవేఁటకాఁడు సమీపమున నున్ననదిలో రక్తసిక్తములగు దనచేతులను గడిగికొని యాబాణమునుగూడఁ గడిగెను, అంత దానిపైఁ గొన్నియక్షరములు గానవచ్చెను. అతఁ డాతురుఁడై వానిని జదివెను, 'ఇచ్ఛినీకుమారి' అని యున్నది. అతఁ డది చదివి యాశ్చర్యమున స్తంభించిపోయెను. మాటిమాటి కతనినోటనుండి 'ఇచ్చినీకుమారి' 'ఇచ్ఛినీకుమారి' అను శబ్దమే వెలువడఁ జొచ్చెను. అతఁడు రెండవవానితో 'ఓయీ! ఈ బాణ మిచ్ఛినీకుమారిది. ఆమెకు విలువిద్యయందుఁగూడ మిక్కిలి నేర్పున్నట్లు తోఁచుచున్నది. ఆహా!