పుట:Ecchini-Kumari1919.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఇచ్చనీ కుమారి


చునా ? పరుల ప్రాణములఁ గాపాడుటకుఁ గ్రూరసర్పమువంటి భీమ దేవుని యుద్ధములో నెదుర్కొని యనవసరముగాఁ దీఱని కష్టము తెచ్చి పెట్టుకొనునా ! పరోపకారు లట్టికష్టములకు వెనుదీయరు. కాని, యారాజచంద్రునకుఁ బరోపకారబుద్ధియున్నదో లేదో, అతనియభిప్రాయ మెట్లుండునో ? అది తెలిసికొను నంతవఱకు నిర్కార్య మెట్లు నిశ్చయించుట !భీమ దేవుఁడు తమపై దండెత్తి నచ్చులోపున నీ కార్యము చక్కబెట్టుకోన వలయును. అందుచే ముందుగా విశ్వాసార్హు డగువాని నొక దూతను బృథ్వీరాజు చెంతకుఁ బుచ్చవ లెను.ఈవిషయమై యామె తనలోఁ జింతించి తుద కిట్లను కొనెను.“నాకుఁ దెలిసిన వారిలో నట్టివాఁ డెవఁ డున్నాఁడు ! నాకు విద్యోప దేశము చేసిన యీశ్వరభట్టిందుల కన్నీ విధములఁదగిన వాడు. అతని బార్థించి యెట్లో యిందుకు సమ్మతింప జేయుదును. తండ్రియనుమతి వడయకుండ స్వతంత్రురాలనై యతని నారాజునొద్దకుఁ బుచ్చినచో లోకులు నన్ను నీతి బాహ్యురాలని నిందింతురా ! వెనుక రుక్మిణి, శిశుపాల జరా సంధాదులను జయించి తన్నుఁ గొని పోనలయునని కృష్ణునకు సం దేశ మంపెను. ఆమె నెవ్వరు నిందించిరి ! అట్లే నేనును భీమ దేవుని జయించి నన్నుఁ గొనిపోయి పెండ్లాడుమని ప్రార్థించుచు నా రాజునకు సం దేశమంపిన నిందు దోషమే మున్నది ! 'కాని, కృష్ణునివలే నా రాజసత్త ముఁడు దీన స్త్రీ, రక్షణమునకు బద్దకంకణుఁ డగునో కాఁడో ? ఏమయిన, మా