పుట:Ecchini-Kumari1919.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్ఛినీకుమారి


మొదటి ప్రకరణము


వేఁట

రాత్రి తెలతెలవాఱఁజొచ్చెను. వేఁగుఁజుక్క యను వార్తాహరునివలన దనమనోహరుఁడగు సూర్యభగవానుని రాకను విని పూర్వదిశాకాంతముఖమున వికాసము వహించెను. ఆసమాచారమును విని భయపడియే కాఁబోలును జుక్కలును, నంతవఱకును దట్టముగా వ్యాపించియున్న చీకటులును మెలమెల్లగా మాయ మగుచుండెను. ప్రాతఃకాల మలయమారుతములు వసంతకుసుమముల పరిమళమును వహించి దిశలను నించుచుండెను. లేమావియాకుల మెసవుటచే మదమెక్కినకోయిల సుఖముగాఁ బంచమస్వర మాలాపించుచుండెను. రాత్రించరము లగుమృగములును, బక్షులును దమతమనిలయములు చేరుకొనుచుండెను. అంతవఱకును నిద్రాగతమై నిస్తబ్ధత వహించిన ప్రాణికోటి తెలివి వహించి కలకలలాడుచుండెను. వ్యాపించియు వ్యాపింపని వెలుతురుతోను, నశించియు నశింపని చీకటితోను గూడిన