పుట:Ecchini-Kumari1919.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 11

55


పుము' అని యుప దేశిం చెను. అది విని యభయసిం గచ్చోటు గదలిపోయెను. తల్లి హితోప దేశము లతని చెవి కెక్కలేదు. రూపవతి చెప్పుచున్న మాటల నాలోచింప నిచ్ఛినియను రాగము తన పై కి మరలుచున్నదని స్పష్టమగుటచే నికఁ గొలఁదిదినములు వేచియుండిన తనకోర్కి సఫలముగావచ్చు నని యభయసింగు తలపోయసాగెను. అంతియ కాని, రూప నతి తన్ను వంచించి తనధనమంతను నపహరింపఁ దలఁచు కొనియే యిట్లు పలుకుచున్నదని యెఱుఁగఁడు. కావున, నభయసింగు రూపవతి యనుగ్రహమును గోరి నానావిధబహు మానము లిచ్చి యామెను సంత సింపఁ జేయుచుండెను. రూప నతియం దితని కెక్కుడు నమ్మకము గుదురుటకు వేరొక "కారణముఁగూడ నున్నది.

ఒక నాడతఁ డచ లేశ్వరుని దర్శింపఁబోయెను. అచలేశ్వరాలయ మెల్లప్పుడును బై రాగులతోను, గోసాయీల తోను నిండి యుండును. వారిలో నొక బైరాగి నెగడియొద్దం గూర్చుండి మంట వెలుఁగున నొక పురుషుని చేతిని బరిశీలించి సాముద్రిక రేఖలననుసరించి ఫలములు చెప్పుచుండెను. అభయ సిం గది చూచి కొంత సేపచ్చట నుండి యాపురుషుని ఫల ములు పూర్తి గాఁ జెప్పిన పిమ్మటం దనకుఁగూడ ఫలములు - చెప్పుమని బై రాగిని గోరెను. పరోపకారి యగు నతఁ డారాజ కుమారుని చేతిని బరిశీలి-చి 'కుమారా ! నీకోర్కి మిగుల గొప్పది ఒక యువతిని బెండ్లాడ నీవు విశ్వప్రయత్నము చేయుచున్నావు, అవునా ? కాదా ? ' అని యడి గెను.