పుట:Ecchini-Kumari1919.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 1153


కిచ్ఛినీకుమారియం దాశ మఠంత పర్ధిల్లెను. అది హెచ్చుచున్న కొలంది. నతడక్కార్యసాధనమున కై ప్రయత్నముల నేకములు చేయఁదొడఁగెను. సనుర్థు రాలగు రూపవతి తన కార్యము నెఱ వేర్పఁజాలునన్న నమ్మక మున్నను నతఁకంతటితో సంతుష్టి. చెందక తనతల్లిని లలితా దేవిని గూడ నందువిషయమై ప్రోత్సాహించెను. తన మేనగోడలిని దన కొడుకున కిమ్మని యడుగుట కామె యెంతయు స్వతంత్రురాలు. మఱియు; యోగ్యురాలు, గుణవంతురాలు, సౌందర్య వంతురాలు నగు నిచ్ఛినీకుమా రివంటి దానిని కోడలుగాఁగైకొన నెవ్వరి కిష్టముండదు. కావున, లలితా దేవికిఁ గూడ నిందువిషయమై యాశ లేక పో లేదు.కాని, యిచ్ఛినికిఁ బృద్వీ రాజునందు ధృథాను రాగముండుట నెఱిఁగినది గావున నిఁకనందులకై ప్రయత్నింప వ్యర్థమని యూరకుం డెను. లలితా దేవి బుద్ధిమంతురాలు గావున లోకములోని సామాన్య స్త్రీలమేనతీకము చేసికొనుటయందు మొండి పట్టుదల వహింప లేదు.

కానీ, యభయసిం నూరకుండనిచ్చునా ? రాత్రిందినము లామె చెవి నిల్లుగట్టుకొని చెప్పి చెప్పి యతఁ డెట్లయిన నేమి, తనతల్లిని తన కార్యసాధన కభిముఖు రాలినిగాఁజేసెను. లలి తా దేవి కుమారునియందలి ప్రేమాతిశయము చేనప్పని కొప్పుకొన్నను దాని నెట్లు సాధించుట ? ఇచ్ఛినీకుమారికి బోధించుట కామె సమర్థురాలును గాదు. స్వతంత్రురా