పుట:Ecchini-Kumari1919.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ఇచ్చి నీకుమారి


నోట నుండ పు: -సందేహమేమి ? ఈవార్త విన్నతోడనే మన రాజ మండిపడి సేనావారముతో గూడివచ్చి యీదుర్గము నవలీనే మంట గలిసి వేయును,

యు: ఇట నుండ నేమి పని ! నీతో వత్తునా ?

పు: రావద్దు. ఇంకను నీవిట నుండ వ లెను. ఎట్లయి నను గార్యము నెరజ వేర్పవలసి యున్నది. నేను కొలఁదికాల మలో నే మరలి వచ్చెదను.

యు: .మంచిది. నీయిష్ట ప్రకారమే నడ చెదను,

అంత నాయికువురు నాప్రదేశమును విడిచి వెడలి పోయిరి,

ప ద వ ప్రకరణము

భీమ దేవుని వీరావేశము

కామ మంతశ్శత్రువులలో నొకటి. దానికి లోబడని 'వాఁడే ధన్యుఁడు. దాని నగ్నితోఁ బోల్తురు. ఆపోలిక దానికి దగియున్నదనుటకు సందియము లేదు. అగ్ని తానాశ్రయించిన వస్తువును దహనము చేయును. కామముగూడ నెవ్వరిని దా నాశ్రయించునో వారినే చెఱుచును. ఎన్ని కట్టియలు దెచ్చి వై చినను నగ్నికి దృప్తి లేదు. ఎన్ని సుఖము లనుభవించినను దృప్తి లేదు. అగ్ని నీటి చేఁ జల్లారునట్లు కామము జ్ఞానముచే సశించునని ' తెలిసికొని యెవఁడు జ్ఞానము నభివర్ణించుకొని