పుట:Ecchini-Kumari1919.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 9

47

దేవదర్శనార్థము వచ్చిన ప్రజలందఱును వెడలిపోఁగానే వా రిరువుకు నొక చోట గూర్చుండి యేదియో ప్రసంగించుకొను చుండిరి. చీకటిలో నుండుటచే వారెవ్వరో గుఱుతింప లేము గాని వారి సంభాషణమునలన వారియుదంత మేముయినను దెలియు నేమో చూతము. వా రేట్లు సంభాషించుచుండిరి .

పు- యువతీ ! నీవు సుఖముగా నున్నావా ! నీ ప్రయత్నము లెట్లున్నవి ?

యు. నాకు సుఖమే ! కాని, నాయత్నము లేమియు సాగుచున్నట్లు లేదు,

పు--ఆ రాజకుమారియభిప్రాయ 'మెట్లున్నది ?

యు— డిల్లీశ్వరుని వరింప నువ్విళ్ళూరుచున్నది.

పు. ఆమెమనస్సును ద్రిప్పుటకుఁ బ్రయత్నింప లేదా?

యు. లేకేమి ! ఎంతప్రయత్నించినను లాభము లేదు, పృద్వీశ్వరుని పై నా మెకు జనించినయనురాగ ప్రవా హము నుట యసాధ్యము. అయినను బరమారునియభి ప్రాయ మెట్లున్నది?

పు— కన్యక కిష్టము లేనపుడు పరమారునియభిప్రాయ ముతో నేమిపని? అయిన నాతనికిఁగూడఁ దనకూఁతును మన ప్రభువున కీయ వలెనని లేదు. జైనమతసంబంధము చేఁ జెడిపోయిన వాఁడఁట మన రాజు. నయమునను, భయమునను నెంత చెప్పినను నతఁ డిష్టపడ లేదు.

యు... అట్లయిన నాబూగడమునకుఁ గాలము సమీ సించుచున్న ట్లున్నది.