పుట:Ecchini-Kumari1919.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 7

35


ఆ రాయబారియు జైతునకు వినయపూర్వకముగా సమస్కరించి తదనుమతిని బడసి యుచితాసనమునఁ గూర్చుం డెను. పరమారుఁ డతనిఁ జూచి 'భీమ దేవుఁడు నాకు రాయ బార మంపియున్నాఁడా ? ఇది మిక్కిలి వింతగా నున్నది. మాకును, నతనికిని వ్యవహారము లేమియును లేవే! ఏదీ ! వినిపింపుమా, నీవృత్తాంతము' అని పల్కఁగా నాతఁడు లేచి నిలువఁబడి రాజేంద్రా ! నేను భీమ దేవుని స్నేహితుఁడను, న న్నమర సింహుఁడందురు. మారాజుననుమతి ననుసరించి తమ్ము దర్శింపనచ్చితిని. మారాజేంద్రుఁడు తమసన్నిధిని బల్కవలయునని చెప్పిన మాటలు యథాను పూర్విగా పించుచున్నాను. దేవరవారవధరింపుఁడు, “ఓరాజేంద్రా ! పరమారునంశజులు రాజపుత్రులలో సుప్రసిద్ధులు. మీ వంశ్యు లందతిలోను నీవు చుక్కలలో జంద్రునివలెఁ బకాశించు చున్నావు. జాతి చేతను, నీతి చేతను, విఖ్యాతి చేతను నీ వీ కాల మున వాసిగాంచినావు.” అని చెప్పుచుండ నతని కడ్డువచ్చి పరమారుఁ డిట్లనియె.

'ఓయీ ! ఇవి భీమదేవుఁడు పల్కిననచనము లే !' యడిగెను.

అమ: దేవా ! 'అవును, అతనినోటనుండి నచ్చిన మాటలే తు, చ తప్పకుండఁ జెప్పుచున్నాను' అని చెప్పెను.

జైతుండాశ్చర్యమును సూచించుచు 'ఆఁ, ఏమి ! భీమ దేవునోటనుండి వచ్చినమాట లేయివి ! ఆశ్చర్యమాశ్చ