పుట:Ecchini-Kumari1919.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఇచ్చినీ కుమారి



అభ---యువతీ ! నేను గోరునది మేమియును గాదు. నీవు నాపక్ష మవలంబించి యారాజపుత్రియును రాగమునకు నన్నుఁ బాత్రునిగాఁ జేయుము. ఇందులకుఁ దగిన ప్రతిఫలము నీవు చెందకపోవు.

రూ- న్యాయ్యపక్షము నవలంబించుట కభ్యంతర మేమున్నది ? తప్పక ప్రయత్నించెదను. అభయసిం గందులకు సంతసించి వెంట నే లేచి తాఁ గొనివచ్చిన ముత్యాలహారమును నాయువతి మెడలో వేసి “రూపవతీ ! ప్రస్తుత మిది బహుమానముగాఁ గైకొనుము. కార్యసాధనానంతరమున నిన్నింతకంటె . నెక్కుడుగా సంత సింపఁ జేసెదను” అని పలికి వెడలిపోయెను.

ఏడవ ప క ర ణ ము

భీమ దేవుని సం దేశము

జై తపరమారుఁ డొక నాఁడు కొలువుదీర్చి యుండెను. మంత్రులును, సామంతులును, సేనానులును, హితులును, బురోహితులును సభయందుచి తాసనములఁ గూర్చుండిరి. ఉదయ కాలమందలి తామరకొలఁకువలె నాసభయంతయుఁ గలక లలాడుచుండెను. అపుడు ద్వారపాలకుఁ డొకసం దేశ కునిఁ గొనివచ్చి రాజసన్నిధిని నిలిపి వెడలిపోయెను.