పుట:Ecchini-Kumari1919.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 5

25


పోయి ఘోరీని జయించి పాఱద్రోలెను. ఈసంతత విజయ ములచే మూర్జర రాజ్యము మధ్యందిన సూర్యమండలమువ లె శత్రువుల చూపులకు దుస్సహమై యాకాలమున నుత్తర హిందూస్థానమునఁ బ్రసిద్ధి కెక్కిన రాజ్యములలో నొక్కటియై పరఁగుచుండెను. అస్ట్రేలపురమున కితని కాలమున వచ్చి నంతయశము మటెప్పు డెవ్వరికాల ములందును సంభవింపక పోవుట చే నితనికి 'అస్ట్రేలపుర భూషణ'మని బిరుదము కల్లెను

• భీముఁడు జైనమత మం దెక్కుడభిమానము గల్లి పెక్కు రు జై నగురువుల కాశ్రయమిచ్చి తన రాజ్యమున నామతము సభివర్ధించుటకు మిగులఁ బాటుపడెను. అయినను హిందువు లనుగాని, తన్మతమును గాని ద్వేషింప లేదు, ఆజైనులలో సమర సింహు: డీ భీమ రాజునకుఁ ' జెలియై, గురువై, చుట్టమై, సేవకుఁడై, సర్వకార్యములందును బాసటయై తోడునీడవలె కరించుచుండెను. అతఁడు మిగుల బుద్ధిశాలి. మాయోపాయ ములందును, మంత్రతంత్రములందును, మంత్రతంత్రములందును, నోషధులందును గడు నేర్పరి. ఇన్ని గుణములుగలవాఁ డగుట చేతనే భీముఁ డతనిఁ బ్రాణపదముగాఁ జూచుకొనుచు నొక క్షణమైనను విడువ లేకుండెను. భీమ దేవుఁ డొకనాఁ డొక దివ్యమందిరమున నొంటిగా గూర్చుండెను. మలయమారుతములు ప్రసరించి మిగుల హాయిని గల్గించుచుండెను. ఏమూలఁ జూచినను నతిమనో హరములగువస్తువులు కంటఁబడి హృదయమున కానందము