పుట:Ecchini-Kumari1919.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 4

21


గుజరాతును బాలించిరి. సామంతసింహునకు సంతతి లేదు. కాని, లీలా దేవి యను తోబుట్టువు మాత్రము కలదు. అతఁ డామెను కలియాపురమును బాలించు భూవనాదిత్యునికునూ రుని కిచ్చి పెండ్లి గావిం చెను. ఆదంపతుల కొక కుమారుఁడు పుట్టెను. అతని పేరు మూల రాజు. సామంత సింహునితోఁ జోరవంశ మంతరించుటచేఁ, దల్లి మూలముగా నవ్లపుర రాజ్యము మూలరాజువశ మయ్యెను. ఆతఁడు క్రీ. శ. 942 వ యేఁట రాజ్యభారము సహించి 997 వ వత్సరమువజుకును గుజ రాతును బరిపాలించెను. గుజరాతును బాలించిన చాళుక్య వంశ రాజులలో నితఁడే మొదటివాఁడు. మూల రాజుననంతర మున చాముండ రాయఁడును, దుర్లభ రాజును నంహిలపురము నకుఁ బ్రభువు లై రి, దుర్లభ రాజు సంతాన హీనుఁ డగుట చే నతని తమ్మునికుమారుఁడగు భీమ దేవుఁడు ఘూర్జర దేశ ప్రభు నయ్యెను. చాళుక్యవంశజులలో నీ భీమ దేవుఁడు మిగుల విఖ్యాతి గాంచిన మహాశూరుఁడు. మహమ్మదజనీ సోమనాథ క్షేత్ర మును ముట్టడించినప్పు డీమహావీరుఁడు సైన్యసమేతుఁ డై పోయి గజనీని మార్కొని ఘోర యుద్ధము చేసి యతని నోడించి తఱిమి వేసెను. దానితో నతనికిరి యుతర హిందూస్థానమందంతటను వ్యాపించెను. అతఁడు 'ఉదయమతి' యనుయువతిని బెండ్లా డెను. ఆదంపతులకుఁ గరుణ రా జుదయించెను. అతఁడు క్రీ. శ. 1072 మొదలుకొని 1094 వ సంవత్సరము దాఁకఁ బరిపాలిం చెను. అతఁడు కర్ణాట దేశపు రాజగు జయకక్షి కూఁతును 'మీన