పుట:Ecchini-Kumari1919.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఇచ్చినీ కుమారి


గూడి యుద్ధారంభమునకుఁ బూర్వమేమే శూరపాలుడు తన సోదరిని దీసికొని యొక యరణ్యముఁ జేరెను. ఆయరణ్యమందే యామెకు- గుమారుఁ డుదయిం చెను, వనమందుఁ బుట్టుట చే నాబాలునికి వన రాజని పేరు గల్లెను. ఆతఁడు క్రమముగాఁ బెద్దవాఁడై తండ్రివలె మహాశూరుఁ డయ్యెను. అతఁడు తండ్రి రాజ్యమును స్వాధీనము గావించుకొన నెంచి మేనమామతో, సమీప గ్రామములను గొల్లఁ గొట్టి దానినలనఁ దగినంత ధన మార్జించి ఖిల్ల సైన్యములను జేర్చుకొని భూవరుని జయించి తజిమి గుజరాతును వశ పఱుచుకొనెను. పూర్వపు రాజధాని యగు పంచాసరము పాడుపడినందున దానిని విడిచి యతఁడు సరస్వతీ నదీతీరమున విశాలసమ ప్రదేశమున నొక పురముఁ గట్టించెను.తనచిన్న తనమున వన వాసదినములలో 'అస్ట్రేలుఁ' డను నొక జైనగురువు తన్నును, తనతల్లిని మిక్కిలి ప్రేమించి కాపొడినందున నాయుపకారమును మఱవక వన రాజు తాను గట్టించిన పట్టణమున కాజైనుని పేరు 'అనిలపుర' మని పేరు పెట్టెను. అదియే ఘూర్జర దేశమునకుఁ జిర కాలము రాజ ధానియై యొ ప్పెను. వన రాజు క్రీ. శ. 746 వ యేఁట గుజ రాతుసింహాసనము నెక్కి యఱువది సంవత్సరములు ప్రజలఁ బాలించి క్రీ. శ. 806 లో గాలధర్మమునొందెను. అతని యనంతరమున యుగ రాజును, క్షేమ రాజును, భూయాదుఁ డును, వీరసింహుఁడును, రత్నాదిత్యుఁడును, సామంత సింహుఁ డును గ్రమముగా నన్షిలవుర సింహాసనమునఁ గూర్చుండి