పుట:Ecchini-Kumari1919.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ఇచ్చనీ కు మారి


డీచాళుక్యులలో నొకరిని గొనిపోయి భీమునితో స్నేహము చేయించినట్లు వినియుంటిని. అందు చే నాయనుమానము మఱింత ప్రబలినది. మీరు సైన్యములతో నిచ్చటికి నచ్చిన పిమ్మట నేను మాజు వేషముతోఁ దఱుచుగా వారి యొద్ద నే తిరుగఁజొచ్చితిని. ఆవృత్తాంత మెప్పటికప్పు డారాజకుమా రికిఁ దెలుప నామె కరుణ రాజునకుఁ దెలుపుచుండెను. .నిన్న సాయంసమయమున వారు రాత్రి మిమ్ముఁ జంపఁదలంచు కొన్నట్లు నేను గ్రహించి యిచ్ఛినితోఁ జెప్పితిని. ఆ రాజ కుమారియుఁ, గరుణరాజును నిన్న రాతి యాదుష్టులను జంపి తమ్ము రక్షించినారు' అని మనవి చేసెను.

ఈశ్వర భట్టున ద్వితీయ రాజభ క్తి ని బృద్వీరాజు మిగుల మెచ్చుకొ నెను. జై తుఁడు తనయాసనమునుండి లేచి, ఈశ్వర భట్టును గౌఁగిలించుకొని తనకూఁతును రక్షించి తమ కుటుంబమునకుఁ జేసినయుపకారమును బ్రతికియున్నంత కాల మును మఱవ నని చెప్పి తగిన బహుమానము లిచ్చి సంత సింపఁ జేసెను. పృద్వీరాజు, కరుణరాజు పాదముల పైఁ బడి తన యవివేకమును క్షమింపవలయు' నని వేఁడికొ నెను. అనంతరము పరమారుఁడు, పృథ్వీరాజును దన పుర మునకుఁ గొనిపోయి తనకూఁతు నతని కిచ్చి మహా వైభన ముతోఁ బెండ్లి గావించెను.

సమా ప్త ము.

మెజస్టిక్ ప్రెస్, రాజమండ్రి.