పుట:Ecchini-Kumari1919.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

ఇచ్చి నీ కుమారివీరుల హరినామస్మరణము లంతటను వ్యాపించుచుండెను. ఒక ఘడియలో యుద్ధభూమి పీనుఁగు పెంట లయ్యెను. యోధులు నలుగడలకుఁ జెదరిపోయిరి. రంగమున భటులు పలుచనై చూపట్టరి. ఇట్లు చెదరిపోయిన బలములు రెండును మరలఁ గూడు కొని పోరు సమయమున సమర సింహుఁ డభయసింగున కగ పడెను. అతఁ డగపడఁగానే యభయసింహుఁడు మిక్కిలి కుపితుఁడై 'ఓరీ ! మాయావీ ! అమరసింహా ! నీవు నాకు వన మూలికావైద్యము నుప దేశించి గురువవై తివి. అందులకు గురుదక్షిణ యొసఁగవలెను. నీవంటి గొప్ప వాని కల్పదక్షిణ చాలదు. పరపదమునకుఁ బట్టాభి షేకము గావించెదను. ఇచ్ఛినీకుమారిని నాకుఁ గూర్ప మిగులఁ బ్రయత్నించితివి. అందులకుఁ బ్రత్యుపకారముగా దేవ తా కాంతను నీకు సమ కూర్చెదను' అని పలికి కత్తిని గిరగిరఁ ద్రిప్పుచు లేడి పైకి లంఘించు పెద్దపులి వలె నాతని పై బడి పట్టుకొని శిరము ఖం డించుటకు సిద్ధపడి యుండ దూరమునుండి భీమ దేవుఁ . డది. చూచి యొక పర్వున వచ్చి యభయసింగు నెదుర్కొనెను. ఆ రాజకుమారుఁడును వెనుదీయక యతనితో యుద్ధము చేయ నారంభించెను. ఇ ట్లిరువురును - జిత్రగతులతోఁ గొంతవడి భీకరయుద్ధ మొనర్చిరి. ఇరుపక్షముల వారును వారి యుద్ధ చాతు ర్యమును బొగడఁజొచ్చిరి. కాని, కొంతవడి కభయసింగు భీమబలుఁడయిన భీమ దేవునిప రాక్ర మముసకుఁ దాళలేక