పుట:Ecchini-Kumari1919.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము 28

167


ధైర్యముతో నిలిచి యుండిరి. అతి వేగముతోఁ బ్రవహించు ' నదీప్రవాహము తన కెదురుగానున్న వస్తువును దాఁకినట్లు ఘూర్జర సైనిక లు రిపు సై న్యముల నొక్క పెట్టునఁ దాఁకిరి. ఆయాటోపమున కాగఁజాలక యాబూ ఢిల్లీ సై న్యములు వెనుక కొరగి యాశత్రుసై న్యమను ప్రవాహమునఁబడి కొట్టు కొనిపోవలసిన దేకాని యవి యతి ధైర్యముతోఁ బర్వతము వలె నిలిచియుండుట చే ఘూర్జరులే ముందునకు మాటుగా వెనుకకుఁ బోనలసివచ్చెను. అయిన వారు వెటనే సేనాధి పతి ప్రోత్సాహము చే మరల ముందున కరిగి యుద్ధమునకుఁ డలపడిరి, అబూ ఢిల్లీ సై న్యములుగూడ ధైర్యముతో వారి నెదుర్కొని పోరాడసాగెను. ఇరుపక్షములవారును బలవంతు లును, ధైర్యవంతులును, సాహసవంతులను నగుటచేఁ బోరు మిగుల భయంకరముగాఁ బరిణమిం చెను. ఆదొమ్మి యుద్ధమున నాయుధము లొండొంటితో దాఁకి యగ్నికణములను రాల్చుచు మెఱపులవలె మెరియుచుండెను. వానిధ్వను లురు ముల ననుక రించుచుండెను. ఇంతలోఁ జిమ్మన గొట్టములతో జిమ్మినట్లు యోధులశరీరములనుండి రక్త ధారలు పైకెగసి పాదఘాతములవలన నెగయుచున్న ధూళుల నడఁగించు చుండెను. వీరభటులశిరములు బంతులవ లెఁ దూలుచుండెను. అవయనములు తుత్తుమురై నేల రాలుచుండెను. చెవులు చెవుడ్పడునట్లు సింహనాదములు ప్రబలుచుండెను. హృదయ మున జాలిపుట్టునట్లు నేలం బడిపోయి ప్రాణములువిడుచు