పుట:Ecchini-Kumari1919.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ఇచ్చి నీ కు మా రి


చుటకు మాఱుగా మున్ముందుగా వారే నన్ను దన్నుటకు యత్నింతురా?

భీ: - అట్లయిన నీయభిప్రాయ మేమి ?

రూ: ఏమియును లేదు. సం దేశహరునితో పాటు మఱి యిర్వురు శత్రువు లెట్లో మనదుర్గమును బ్ర వేశించియున్నారు. వారే సం దేశహరునితోఁగూడి నా కిట్టిబాధ కల్గించి యుందు రని,

భీ: రూపవతీ ! నీవు చెప్పునది యెట్లును సరిపో తున్నది. నాయాజ్ఞ లేకుండ నితరులు మనదుర్గమును జొచ్చుట యసాధ్యము. సం దేశహరుఁడుమాత్రమే శత్రువు, తక్కిన వారు మనవారే కావచ్చును. - మఱియు వారందఱు శత్రు వులే యనుకొందము. అట్లయిన నాయజ్ఞను బొంది నీతో వచ్చుటకు సిద్ధమయిన భూయాదుఁ డేమయియుండును? అతఁడు పయనమై రాకముం దే శత్రువులు నిన్ను 'మోసపుచ్చి తీసి కొనిపోయినా రనుకొన్నను భూయాదుఁడు నీవు కనఁబడక పోవుట చే నా చెంతకు వచ్చి నిజస్థితి చెప్పకుండునా ? కావున, భూయాదుఁడు లోలోపల శత్రువులవలన లంచముఁ గొని వారిలో నైక్యమైయుండుట నిజము,

అని పల్కి భీమ దేవుఁ డంతతో నూరకుండక ఒక భటుని బిలిచి భూయాదునింటికిఁ బోయి యతనివృత్తాంతము తెలిసికొనిర'మ్మని చెప్పఁగా వాఁడు పోయి వచ్చి 'మహా రాజూ ! భూయాదుఁడు పయనమై రాత్రియే యిల్లు విడిచి