ప్రక ర ణ ము 3
13
వారు మిగుల నానందించి యచ్చోటును గదలిపో లేకుండిరి, ఆచిత్రములను జూచుటకంటె నచ్చటి కొందఱు కావనిత ముఖ పద్మమును జూచుటయందే మిక్కిలి యింపు జనించుచుండెను. ఇంతలో నొక యువతి యచ్చటికి వచ్చి జనుల నొత్తి గించికొని యామెను సమీపించి “మా రాజకుమారి నీచిత్ర పటముఁజూడ నభిలషించుచున్నది, రమ్ము; నాతో నంతః పురమునకు రమ్ము” అని చెప్పెను. ఆరూపవతి యందులకు సంతసించి కొనక పోయినను నెగాదిగఁజూచి యానందించు చున్న వారి చేతులలోనిపటములను లాగుకొని యాదాసితో నంతఃపురమునకుఁ బోయెను. తమయానందమునకు భంగము గల్గించిన యాదాసిని దిట్టనివా రచ్చట నొక్కరును లేరు. రూపవతి యాదాసిని వెంబడించి పెక్కుమందిరము లను గడచి పోయిపోయి శుద్ధాంతమును ప్రవేశించెను. ఆభవనము స్ఫటిక శిలా నిర్మితమై యెటుచూచిన నతిమనో హరమై యద్దమువ లేఁ దళతళలాడుచుండెను. అందొక విశాల మండపమున రాజకుమారి సఖులతోఁ గూర్చుండియుం డెను. చుక్కలనడుమ బాలచంద్ర రేఖవ లెఁ బోలుపాఱుచున్న యా రాజకుమారినిఁ జూచి భూమి కవతరించిన దేవకాంతయేమో యని రూపవతి భ్రమింపక పోలేదు. అది పెక్కండ్ర నంతః పుర స్త్రీలను జూచియుండెనుగాని యీ రాజకుమారియంత సౌందర్యవతిని జూచియుండ లేదు. ఒకమాఱామెయందమును గన్ను లారఁ జూచి రూపవతి యామెకు నమస్కారము చేసి