పుట:Ecchini-Kumari1919.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 26


ఏని యదరిపడి తమదర్శనము చేయఁగోరుచున్నాఁడు. ఏదో యాపద్వార్తను దెచ్చె నఁట !' అని మనవి చేసెను.

ఇచ్ఛినీకుమారిని వశముగావించుకొనుట కుపాయము లనుగూర్చి రూపవతితో సంభాషించుచున్న భీమరా జామాట విని యదిరిపడి “ఆఁ, ఏమీ! మధుమంతుఁడు పంపెనా! అతఁడు శత్రువుల కారాగారమును దప్పించుకొని వచ్చెనా! అట్లయిన నది సంతోషవార్తయే కాని యాపద్వార్త యెట్ల గును? అతని వృత్తాంతము తప్పక యరయవలయును. రూప నతీ! అతని విడిపింపవలయు నని నీవు న న్నెన్నోమారులు ప్రార్థించియున్నావు. మనము ప్రయాసపడకుండ నతఁడే తప్పించుకొనివచ్చెను. లెమ్ము; ఇట్టి బుద్ధిమంతుఁడు, ఇట్టి మాయావిశారదుఁడు శత్రువుల కెట్లు చిక్కిపోయినాఁడో నా కాశ్చర్య మగుచున్నది' అని పల్కి భటునితో సం దేశహరుని లోనికిఁ బంపు మని యాజ్ఞాపింప వాడు వెడలిపోయెను.

రూపవతి మహా రాజును “ఓ మహాప్రభూ! ఈ వార్త విన్న ప్పటినుండియు నాగుండె దడదడ కొట్టుకొను చున్నది. మునుపటికంటెను నాకు భయము హెచ్చుచున్నది. అతని కెట్టియాపద సంభవించెనో యని నామనస్సు మిగులఁ బరితపించుచున్నది. ఏలినవారు చెప్పినపని సులభ ముగా నిరపాయముగా నెఱవేర్చుకొనివచ్చితి మని యానం దించుచుండ భగవంతుఁడు మా కెట్టి యాపదను దెచ్చి