పుట:Ecchini-Kumari1919.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఇ చ్చి నీ కు మా రి


బుణ్య క్షేత్రములే నిదర్శనములు. ఒక్కొక క్షేత్రమం దుండిన శిలావిగహములను జూచిన నత్యాశ్చర్యము గొలు పకపోవు, పూర్వము రాజులకుఁ జిత్రకళయందభిరుచి యెక్కుడుగా నుండెను. వారు స్వయముగా నేర్చుకొనుట యే కాక యంతఃపుర స్త్రీలకు గూడ నేర్పించుచుండు వారు. రాజు లావిద్య నంతగా నాదరించుట చేత నే పూర్వ మది యంత యౌన్నత్యముఁ గాంచినది.

ఒక నాఁ డొక చిత్రకారయువతి కొన్ని చిత్రపటములను జేత బట్టుకొని కొన్ని పెట్టెలోనుంచుకొని యమ్ముకొనుట కై యాబూగడపు రాజవీథినిఁబడి పోవుచుండెను. దాని వయస్సు ముప్పదివత్సరములకు మించి యుండును. అయిన నది సౌం దర్యమున సుంతయైనఁ గొఱంత వడ లేదు. దాని వాక్చా తుర్యము మృదుమధురముగా నుండెను. దాని పేరు రూపవతి. దానిఁ జూచినవా రా పేరు దానికిఁ దగు నని పలుకక పోరు. ఆయువతి చిత్రపటముల నమ్ముకొనుటకై యాపురమున కొకటి రెండుదినముల క్రిందట వచ్చియుండెను. దాని కాపుర మునఁ బరిచితులు లేరు.


ఆరూపవతి రాజగృహమునకు సమీపముగా నొక చోట గూర్చుండి యమ్ముకొనుటకై చిత్ర పటములను దీసి యచ్చటి వారికిఁ జూపుచుండెను. ఒక్క నిముసములోనే యాచిత్రము లను జూచుటకు జనులు పెక్కురు ప్రోవైరి. ఆచిత్రములను జూచియు, నావనిత చెప్పుసరస వచనములు వినియు నచ్చటి.