పుట:Ecchini-Kumari1919.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్చనీకుమారి

148


భ: — ఎక్కడనుండి వచ్చితివి ?

పు: -అనిహి లపురమునుండి.

భ: -ని న్నె వరు పంపిరి ?

పు: -మధుమంతుఁడు.

భ: -(ఆశ్చర్యముతో) మధుమంతుఁడా !

పు: -అవును, మధుమంతుఁడు

భ: _అతఁడు పరమారునికారాగృహమున నున్నా డని వినియున్నా మే!

పు : —అది నిశ్చయమే ! కాని, మాయోపాయము చేఁ దప్పించుకొనెను.

భ: - అట్లయిన నతఁ డిచ్చటికి రాక యనీహిలపురమున కేల పోయెను?

పు: -(విసివికొనుచు) మీకు సమాధానము చెప్పునప్ప టికి నాకు నోరు నొచ్చుచున్నది. అదంతయు మీ కేల ? 'నన్ను రాజసన్నిధికిఁ. బోనిండు.

భ: -ప్రభువుగారి సెల వైనఁ గాని నిన్ను లోనికి విడువ వలనుపడదు.

పు: అట్లయినఁ ద్వరగాఁ బోయి విన్న వింపుఁడు. ఆభటులలో నొకఁడు వేగముగా రాజును సమీపించి 'మహాప్రభూ ! అనిహలపు రమునుండి ' యొక భటుఁడు వచ్చి నాఁడు. మధుమంతుఁ డేదో యుత్త రమిచ్చి పంపె నఁట.