పుట:Ecchini-Kumari1919.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 26

147


అట్టిసమయమున నొక పురుషు డెచ్చటనుండియో మధుమంతమువకు వచ్చుచు చుండెను. పండు తమలపాకువంటి యతనిశరీం మెండ వేడిమికి మిగులఁ గందిపోయి యుండెను. అతని ముఖము మిక్కిలి కాంతిదక్కి, యుండెను. వర్షానంతర మునం గొండ శిఖరమునుండి ప్రవహించు సెలయేళ్ళన వలె జెమ్మట లతనిశిరోభాగమునుండి కాలువలుగట్టి పాఱుచు. గట్టువస్త్రములను బూర్తి గాఁ దడిపి వైచెను. అతఁడు దీర్ఘ ప్రయాణము చేసినట్లు మిక్కిలి బడలియుండెను. అతఁ డేదో య త్యావశ్యక మగుపనిని నిర్వహింపఁ బోవుచున్నాఁడని నిశ్చ యింపగలము. లేనిచో నట్టి భయంకర సమయమునఁ బ్రయా ణము చేయునా ? అతఁడు దుర్గ ద్వారమును సమీపించి పెద్ద గొంతుతో అయ్యా ! రక్షకభటులారా ! తలుపుఁ దీయుఁడు . నేను ప్రభువుగారిని దర్శింపవలెను. ఒక యాపద్వార్త మోసి కొనివచ్చితిని. దానిని రాజుగారికిఁ దెలుప వలెను. మీ రెంత మాత్ర మాలస్యము చేయ రాదు. చేసితీ రేని మీకును, నాకును గూడ మాటవచ్చును' అని కేక వేసెను.

రక్షక భటు లది విని యేదో యాపద సంభవించియుండు సని నిశ్చయించి తొందర పడి రాక పోకల కనుకూలముగా దుర్గక వాటమున కమర్పఁబడిన చిన్న తలుపును దెఱచి యత నీట్లు సంభాషించిరి.

భ: --అయ్యా ! నీ నెవ్వఁడవు ?

వు: - నే నొక సందేశహరుఁడను.