పుట:Ecchini-Kumari1919.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 25

143


హస్త లాఘవమునకు మెచ్చుకొంటిని. సుందరీ! నీ కింత నేర్పు- మావంటి వీరులుగూడ మెచ్చుకొనఁదగినంత నేర్పు-నీ కే ట్లలవడెను ! మఱియొక మాఱు వింటిని మో పెట్టి బాణమును సంధించి లక్ష్యమును భేదించి నా కానందముఁగూర్పుము' అని పలికెను.

ఇచ్ఛిని యాతని పలుకులు వీని 'రాజా ! నీగంభీరవచ నములకు జంకుదానను గాను. నిన్ను వరించు దానను గాను. నీదుర్గమున నన్ని టైంత కాలము నిర్బంధింతువో నిర్బంధిం పుము. పుష్పకోమలగాత్రి నగు నన్నిట్లెంత కాలము బాధిం తువో బాధింపుము. నా పురాకృతకర్మ మిట్టిదిక దా యని తలంచుచు నీవొనర్చు బాధల ననుభవింతును. కానిమ్ము. యువతీజనమును బలాత్కరించి తెచ్చి నిర్బంధిం చెడు నీ రాక్షసకృత్య మీస్మొటికి క్షత్రియ వంశసంభవుఁడు, అందులోఁ చాళుక్యవంశసంభవుఁ డొనర్చెనని విని తోడిరాజు లంద ఱానందింతురుగాక ! త్రేతాయుగమునందువలె నీకలియుగ మందును స్త్రీ జనకంటకుఁ డొకఁ డున్నాఁడన్న ప్రఖ్యాతి నీవలనఁ గలుఁగాక ! ' అని పల్కుచుండ --

భీ: ఆఁ, ఏమేమో ! నేను స్త్రీ జనకంటకుఁడనా ?

ఇచ్ఛి: -స్త్రీలను బాధించువారు మ రెవ్వరు ?

భీ: నిన్ను బాధించుచున్నానా ?

ఇచ్చి: — కాక, నాకు సుఖమే కల్గించుచున్నా వా !