పుట:Ecchini-Kumari1919.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

ఇచ్చనీకుమారి


ఒక నాడతం డిచ్ఛినీకుమారినిఁ జూచుతలంపుతో నా మందిరమునకు బోయెను. ఆమె వకుళ తో నేదియో సంభాషించుచు నాక స్మికముగా నటఁ బ్రత్యక్షమయిన భీమునిఁ జూచి చటాలున లేచి మేల్ముసుఁగు సవరించుకొని నిలువఁ బడెను. అపుడు భీముఁ డామెను జూచి 'యువతీ ! నీవు లేచి ప్రత్యుత్థానము చేయ నవసరము లేదు. నీవు నిలునఁబడియుండి యుండుటను జూచి చిగురువలె నతికోమలములగు నీ పాదము లెక్కడఁ గందునో యని నామనస్సు కుందుచున్నది. కూర్చుం డుము, కూర్చుండుము. నిలువఁబడిన నేమి ? కూర్చుండిన నేమి ? సంతోష పూర్వకముగా నాతో సంభాషించినఁ జాలును. యువతీ ! నిన్ను విడిపింప ఢిల్లీశ్వరుఁడు గూడ వచ్చి యున్నాడు. వచ్చుఁగాక ! ఏమిలాభము ? ఈ చాళుక్య భీము నకు శత్రుభయంకరుఁడగు నలపురమునకు_చేఁ జిక్కిన వస్తువును విడిపింప ఢిల్లీశ్వరునకుఁ గాదు, సురగణములతో గూడివచ్చిన సురేశ్వరునకై నను దరమా ! ప్రమథగణ సహితుఁడైన - మహేశ్వరునికై నను దరమా ! నాపరాక్రమ మును నెదుటి వారిప రాక్రమమును బరిశీలింతువు గాక ! ఢిల్లీశ్వ రుకంటే నెక్కుడుపరాక్రమ శాలినైనచో వరింతువా ? చెప్పుము. పోనిమ్ము, నీవు నన్ను వరించినను సరియె. లేక పోయినను సరియె, ఏదీ నీధనుర్విద్యా పాండిత్యమును మఱి యొక సారి చూపుము. ఆనాఁడు సులభముగానే నా టెక్కె మును బడఁగొట్టితివి. నీలక్ష్యుశుద్ధికి మిగుల నానందించితిని,