పుట:Ecchini-Kumari1919.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

ఇచ్చనీకుమారి


దేదియు క్తమో మును భయము లేదు. మాయిచ్ఛిని నీదయకుఁ బాత్రురాలగు టచేధన్యురాలయినది. మాయావిని మాయ చేత నే జయింప వలెనని పెద్ద లందురు. మాయచే మనల వంచించి యిచ్ఛినీ కుమారిని భీముఁడు గొనిపోయెను. ఆభీముని మనము మాయచేఁ గన్ను గప్పి యిచ్చినిని గొనివచ్చుట యుచితము గాదా! మనకు భీమునితో నిప్పట్టున యుద్ధము తప్పదు, ముందుగా నిచ్ఛినీకుమారి నెట్లో మన శిబిరమునకు రప్పించి యుద్ధ మొనర్చుటయా? మొదటిపక్ష మును మనమవలంబించి నచో ముందుగా మనమే సమరమునకు దిగవలెను. రెండవ పక్షు మైన చో నిచ్ఛినిని విడుచుట కిష్టము లేక భీముఁ డే ముందుగా యుద్ధ మారంభించును. ఇందేది యుక్తనో యోజింపుము." అని పల్కెను. అది విని పృద్వీ రాజు 'భూపాలా ! భీముని సై స్యములు సామాన్యములు కావు. మనము ముందు యుద్ధమునకే కడంగినచో సెన్ని దినములు పట్టునో యెవ్వరు చెప్పఁగలరు. ఈలోపున మాయావి యగు భీముఁ డాకుమారి కెట్టియాపద పుట్టించునో; యెట్టిపరాభ వముఁ గల్గించునో; రాకుమారిని విడిపించుట యే మనకు ముఖ్య కార్యము, ఆమె 'చేజిక్కి-న పిమ్మట మన మేమి చేసినను విచారముండదు. . తగిన యుపాయ మలవడిన చో నామెను విడిపించి తెచ్చుటయే యుచితము.' ” అని ప్రత్యుత్తరము చెప్పెను. అందుచే నొక మూల నాబూ సైన్యములును, నొక తట్టు ఢిల్లీ బలములును విడిసియుండిన వేకాని యుద్ధ మారంభింప