పుట:Ecchini-Kumari1919.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఇచ్చనీకుమారి


వంశమునఁ బొడమితిని. ' అందులో నన్ని విధములను వాసి గాంచిన జై తపరమారుని కుమారికను. భవదీయగుణ సంప దను విని నాహృదయకమలము నిదివఱకే యర్పించుకొని యున్నాను. మనమున నిశ్చయించుకొన్న పురుషుఁడు భర్త యగుననుటకు సందియము లేదు. ఇట్లుండ నీ భార్య నగు సన్ను మూర్జర భీమ దేవుఁడు మోహించి మాయోపాయ ముచే దనపురమగు నీ మధుమంతమునకుఁ గొనివచ్చి చేటు పెట్టెను. మాతండ్రిగారు నన్ను విడిపించుటకై సైన్యసమే తులై వచ్చియుఁ బ్రబలుఁడగుభీమ దేవు నెదుర్కొన వెను దీయుచున్నారు. వా రొక వేళఁ దెగించి పోరినను యుద్ధమున మడియుట తప్ప భీముని జయింప లేరు. నన్ను విడిపింప లేరు. కావున, మహాపరాక్రమశాలి వగునీవు . వచ్చి శత్రువును జయించి నీ భార్యను విడిపించుకొనుము. ఏవిధమునం జూచి నను నే నీ పట్టున మీకు పేక్షింపదగిన దానను గాను, త్రికర ణములలో మనస్సే ప్రధానమగుట దానిచే వరింపఁబడిన మీరు భర్త లే యనుకొన్న చోఁ బరగృహీత నగునన్ను రక్షింపవలసినదని వేఱ చెప్పవలయునా ? రావణుఁ డపహ రించిన సీతను విడిపించుటకై రాముడెంత కష్టపడెనో, యెట్లు విడిపించెనో దేవరకుఁ దెలియని విషయము కాదు. ఒక వేళ నేను మిమ్మును ప్రేమించినను నన్ను మీరు ప్రేమింపక భార్యనుగాఁ జేసికొనుటకు మీ కిష్టము లేక పోయి యుండ వచ్చును, అయినను నేను పేక్షింపఁదగినదానను గాను: