పుట:Ecchini-Kumari1919.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఇచ్చనీ కు మారిఇచ్ఛి: – ఆఁడు దానివలన రక్షణ మొందుటకు తండ్రి యంత పౌరుష హీనుఁడు కాడు. అంత వివేకశూన్యుఁడు కాఁడు. కానున్నది కాక మానదు, మీరిఁకఁ బోల్లుమాట లాడక చేయఁదలఁచినది చేసికొనుఁడు.

భీముఁ డది విని తన హితోపదేశము వ్యర్థమైన దని తలంచి కొంత సేపూరకుండి యిట్లనియె. “ఓ రాజపుత్రీ ! మీతండ్రియందు నీ వంత క్రూరత వహించినను నేను సహింప లేను. యుద్ధమున నతని నెదుర్కొన సాహసింపఁగలనా?' అని పలికెను.

ఇచ్ఛి: — ఇంత దయార్ద్రహృదయు లగుటనే కాఁ బోలు మా కుటుంబము నింతగా సుఖింపఁ జేయుచున్నారు.

భీ-: యువతీ ! నాకు మీయందు ద్వేషము లేదు. మిమ్ము బాధింపవలెనని లేదు.

ఇచ్చి:- అట్లయిన 'మోసపుచ్చి స న్ని చ్చటి కెందు లకుఁ దెచ్చినారు !

భీ: నిన్ను బాధించుటకుఁ దీసికోని రా లేదు. నీయస్త్ర విద్యా నై పుణ్యమును జూచి యానందించుటకు.

ఇచ్చి: -- అదియే సత్యమైన నీస్వల్పమునకు న న్నీ దుర్గమున బంధించి బాధింపవ లెనా ?

భీ: -నీ కది స్వల్పమైనను సా కది ఘన మే ! నీయస్త్ర విద్యాప్రవీణతం 'జూపు దేని చూచి యానందించి నిన్ను విడిచిపుచ్చెదను.