పుట:Ecchini-Kumari1919.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము .22

127

యు త్తమురాలికిఁ దగునా? నిన్నుఁ గన్నందులకు నీతండ్రికి నీవు గల్గించు మతిఫలమిదియా? ఆలోచింపుము, మివారిని రక్షింపఁ గంకణముగట్టుకొనుము' అని హితోప దేశముఁ "జేసెను.

ఆ వచనము లిచ్ఛిని విని లోలోపలఁ బొంగివచ్చు కోపమును నతికష్టముచే నడంచుకొని తా నతనికిఁ దగిన సమాధాన మిచ్చి నోరుగట్టింపకున్న నిక నతఁ డిట్లే మాటాడుచుండు నని భావించి మెల్లగా 'మావిషయమై జాలిపడనవరము లేదు. ఇదివఱకుఁ గల్గించిన కష్టముకంటెఁ బెద్దకష్టమును మీరు గల్గింప లేరు. చేయవలసినది చేసి కొనుఁడు. ఉత్తమ క్షత్రియులకు వీరమరణము శ్లాఘనీయము. మా తండ్రిగా రట్లు చేసి మరణబాధకంటే మిగులఁ దీవ్ర మయిన యిహలోక దుఃఖములను విడిచి శాశ్వతసుఖ మనుభ వింతురుగాక ! వాయిష్టమువచ్చినట్లు చేసికొనుఁడు' అని పలికెను.

భీ:- యువతీ! మీతండి నట్టిదుఃఖములపాలు చేయుట తగునా! ఇచ్ఛి: — శత్రీయునకు యుద్ధమరణము దుఃఖకరముగా దని చెప్పితి నే!

భీమ: — తప్పింప నన కాశము నీకుఁ గల్గియు నట్టి మెట్ట వేదాంతపు వచనములాడెద వేల? |


|