పుట:Ecchini-Kumari1919.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఇచ్చనీ కు మారి


వచ్చుననియుఁ దలంచి యామెవచనమునకై ప్రతీక్షించి యుండెను. కాని, యెంత సే ఫూరకున్నను బ్రత్యుత్తరము రాలేదు. భీముఁ డామెను జూచి 'రాజపుతీ! ఊరకుందు వేల? నీ విప్పుడు చక్కఁగా నాలోచింపవలసిన సమయము. కార్యము మించిపోయిన పిమ్మట నేమనుకొన్నను లాభము లేదు. మీతండ్రి గారికిఁ బాణాపాయము సంభవించుచున్న పుడు దానిఁ దప్పించుట నీకు విహితకృత్యము. అది నీ కశక్యము కాదు. అది నీ చేతిలో నే యున్నది. కన్న తండ్రి వంతలఁబడుచుండఁ జూచి నీవు సహింపఁగలవా? చెప్పుము, చెప్పుము' అని యడిగెను.

అందుల కొమె 'సహింపలే' నని యుత్తరమిచ్చు నని యతఁ డనుకొ నెను, కాని, యాయువతి యేమియును మాటాడ లేదు. భీముఁ డంతతో నూరకుండక 'యువతీ ! మాటాడ 'వేమి? నేఁ దలంచిన నొక్క క్షణములోనే నీతండ్రిని, నీ సైన్య ములను జయించి యాబూగడమును మంట గలుపుదును. అయినను నే నాపని చేయనక్కఱ లేదు. నే నిక్కడనుండి చేసైగ జేసినఁ బాలును. నా సైన్యములే సర్వమును జక్క పెట్టుకొనును. కావునఁ గార్యనిశ్చయముఁ జేయుము. నీ మూలమున నీతండ్రికి పెద్దయపాయము వచ్చుచుండ గూతురనగు నీవు తప్పింపవలదా? నిన్నుఁ గని పెంచి పెద్ద జేసిన తండ్రి నిట్టియాపత్సమయమున విడుచుట నీవంటి