పుట:Ecchini-Kumari1919.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర క ర ణ ము .2

9

వలె వెలయుచుండెను. తాను దానిని గప్పిపుచ్చఁబ్రయత్నించియు నందుఁ గృతార్థుఁడు కాకపోవుటచే శంకరుఁ డప్పని భగవత్సంకల్పితము కాదని యిఁక నాప్రయత్నము నుండి విరమించెను. అంత పార్వతి తనముద్దుతమ్ముని విడచి యుండలేక యచ్చటికి వచ్చి యీపిల్లగుట్టపై నివసించెను. సాక్షాత్పరమేశ్వరి వచ్చి యందు వెలయుటచే నది పుణ్యస్థలం బని యెంచ దేవతలును, మునులును నామె కట నాలయమును గట్టి పూజించుచుండిరి. కలి ప్రవేశించుటతోడనే దేవతలు భూమికి రాకపోవుటచేతను మునులు మాయమగుటచేతను నాయాలయము పాడయిపోయెను.

ఇట్టి వింతలకు నిలయ మగుటచే జనులు వేనవేలు యాత్రార్థ మాగిరికి వచ్చుచుందురు. సంతతము జనులరాకపోకలుగల యాపర్వతముపై నెలకొని జైనులు తమతమమతమును హిందువుల కుపదేశించి తమలో జేర్చుకొనుచుండిరి. అందుచే నాపర్వతమున హిందువులయాలయము లే కాక, జైనమందిరములుఁ గూడఁ బెక్కులు గలవు. ఇట్లు నానావిధమందిరములతో నిండినయాపర్వత మెక్కిన వారి కది లోకాంతరముగాఁ జూపట్టుచుండును.

ఆపర్వతపాదమందును, జఱియలయందును బెక్కులు పల్లెలును, గ్రామములును, దుర్గములును గలవు. వానిలో నాబూగడము మిగుల బలిష్ఠమగు దుర్గము. దానిని బరమారు వంశజులగు క్షత్రియు లేలుచుండిరి. మొదట నీక్షత్రియులు