పుట:Ecchini-Kumari1919.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము 21

117

గడిఖండములు గావించి యాకన్యను సాధించి "తేవలె నని సైన్యమును సిద్ధపఱచుకొని యుండెను. అభయసింగు సూచించినట్టు లాదురాత్ముఁడు భీమ దేవుఁడే యైనచో మహా బలిష్ఠుఁడగు నతని జయించుట పరమారున కసాధ్య మే! అయి నను, నతఁడు మిగులఁ గుపితుఁ డైనందునఁ గన్యాపహర్త భీముఁడే యైనను, లేక పినాక పాణియగు సోముఁ డే యైనను, దనకు జయమే లభించినను, నపజయమే లభించినను, దుద కేమైనను నాశత్రువు నెదుర్కొనవలెననియె నిశ్చయించు కొనెను. ఒక నాఁడు జై తుఁడు తగు పరివారముతో నొక చోఁ గూర్చుండఁగాఁ బదుగురు మనుష్యులు బద్ధుఁడగు నొక పురు షునిఁ గొనివచ్చి రాజు సన్నిధి నుంచిరి. అందులకు రా జూశ్చర్యముతో వీఁ డెవఁ డని వారి నడుగఁగా 'అయ్యా! వీఁ డెవఁతో మే మెఱుంగము, ఈశ్వరభట్టుగారు దీనిని దమ సన్నిధికిఁ గొనిరావలయునని మా కాజ్ఞయిచ్చుటచే మాపని మేము గావించుకొంటిమి' అని వారు మనవి చేసికొనిరి.

'అట్లయిన నీశ్వరభ ట్టెచ్చట !' అని పరమార్కుడు మరలఁ బ్రశ్నింప వారింట నున్నారు. ఇప్పుడే వచ్చెద మని యన్నారు' అని పలికిరి, పరమారుఁ డీశ్వర భట్టువచ్చునంత కును మనస్సును బట్టియుంప లేక సమాచార సేమియో తెలిసి కొననలె నని బద్ధుఁడగు నాపురుషునిఁ జూచి 'ఓరీ ! నీ వెవఁ డవు ? ఎవని సేవకుఁడవు ! నాకుమారిక నపహరించిన దురా త్ముఁడ వీవు కావు గదా ! చెప్పుము చెప్పుము' అని పలు