పుట:Ecchini-Kumari1919.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 20

113



చుచు నాహారముఁగొనక , నిద్రవోవక , రాజ్యవ్యనహారములు చూడక, యాప్తులతో నై నను భాషింపక క్రమక్రమముగాఁ జిక్కి శల్యమై గుర్తింపఁదరముగాని యవస్థను బొంది భూతము సోఁకిన వానిభంగి వికార చేష్టలు చేయుచు నర్తించుచుండెను. ఇచ్ఛినీకుమారి జాడలు దెలిపి పరమారునివలనఁ బెద్ద బహుమానముఁ బొందవ లెనని తలంచి దేశమును వెదకఁ బోయినవా రొక్కరొక్కరే నచ్చి యాబూగడమును జేరిరి. మార్గాయాసము దక్క వారికి వేటికలాభము లేక పోయెను. ఆహారసంపాదనార్థము నలుదిక్కులకుఁ జెదరిపోయిన పక్షులు తిరిగి తమకులాయములు చొచ్చునట్లు సులభముగా నే యిచ్ఛినీ కుమారిని వెదకి తెచ్చెద మని ప్రగల్భములు పలికి పోయిన వారిలో, బెక్కండ్రు చాటుచాటున వచ్చి తమతమగృహము లను జేరిరి. అంతియ కాని యొక్కఁడును నిచ్ఛినివార్తను దెలి పిన వారు లేకపోయిరి.

అంత నొకనాఁడు కొందఱు పురుషు లొక పురుషుని భుజములపై నై చికొని వచ్చి పరమారునిముందుఁ బడ వేసిరి. ఆపురుషుఁడు మిగులఁ గృశించిపోయెను, చుట్టునున్న వా రతనిఁ జూచి యతికష్టముచే గుఱుతించి 'అభయసింగు, అభయసింగు' అని కేకలు వేయనారంభించిరి. అది విని ప్రజ లందజు నాశ్చర్యపడి యభయసింగు వృత్తాంతముఁ దెలిసి కొనఁ గుతూహలులై గుంపులు గుంపులుగాఁ గూడి వచ్చి యభయసింగుచుట్టును మూఁగిరి. పరమారుఁ డతనిజూడగానే