పుట:Ecchini-Kumari1919.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 19

111


చాతుర్యమును వలచినట్లే నేనును నొక రాజకుమారునియస్త్ర నైపుణ్యమునకుఁ బట్టునడి నలచితిని. ఇదివఱ కే నామన స్సతని కర్పించితిని. ఇక నీవు నీ పట్టుదల విడిచి నన్ను విడుదల చేసి సగౌర నముగాఁ బంపి వేయుము. అట్లయిన నీనుఁ బెద్ద గౌరవ మును గీర్తియును గల్గును."

ఆమాటలు భీముఁడు విని 'నీవు వరించిన రాజు నెఱుఁ గుదును. అతఁడు నాకుఁ బరమశత్రువు. వాని నిఁకఁ గొలఁది దినములలోఁ జంపెదను. అట్టి వానిని జేపట్టి యేమి సుఖంచె దవు ? కావున, నీమనస్సు మరలించి నన్ను వరింపుము' అని పలికెను.

ఇచ్చి: -నిజముగా నీ వాతనిఁ జయింప లేవు. అయి నను నతఁడే నాకు భర్త'

భీ: -యువతీ ! నీవు మొండిపట్టుపట్టి వ్యర్థముగాఁ జెడి పోకుము. నీమూలమున నీ తండ్రి రాజ్యమున కపాయము గల్గింపకుము. నీవు నన్ను వరింపని చో మీతండ్రిని నిముసము లో నేజయించి, పృశ్వీరాజునుజంపి యా రాజ్యమును నావశము గావించుకొందును. అప్పుడు నీవు చేయునది - లేక నన్నె వరింతువు.

ఇచ్చి: —అది వట్టిమాట! నీ వేమి చేయ్యగలవో చేయుము. శక్తి గల్గిన చో వారినందఱను జయించి సామా జ్యము స్థాపించుకొనుము. నీవు సార్వభౌముఁడ వైనను, ముల్లో కముల కధిపతి వైనను నిన్ను వరింపను.