పుట:Ecchini-Kumari1919.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఇచ్చనీ కు మారి

నా కెట్టి గౌరన ముదయించునో, యెట్టి యనురాగము మొక లెత్తునో చెప్పవలయునా ? నీకడగంటి చూపులు నా పైకి మలపి నన్ను వరించి కృష్ణునకు సత్యభామవ లె యుద్ధరంగము లందు నీవు నా కెన్నఁడు బాసట నై యుందువో యని కొండం తాస పెట్టుకొన్నాను. కోమలీ ! సొమనోరథము లీ డేర్పుము' అని పలికెను.


ఇదివఱకు భీమునిచర్యలు విన్నయిచ్ఛినీకుమారి గా పలుకులు మిక్కిలి చూశ్చర్యమును గలిగిం చెను. అతనిమాటల యందుఁ దా ననుకొన్నట్లు దుందుడుకుఁదనముగాని, మోటుఁ దనముగాని యా మెకు జూ పట్ట లేదు. అతఁ డంత పొందిక గాను సరసముగాను మాటాడునని యామె యనుకొన లేదు. తన కట్టి యిక్కట్లు గల్గించినందుల కతనిపై సామెకు గోపము హెచ్చు పెరుగుచున్నను నతఁ డంత మృదువుగా మాటాడుచున్నపుడు గఠినముగాఁ బ్రత్యుత్తర మిచ్చుట తగవు గాదని తలంచి వీణాస్వరమువంటి మృదు మధురమగుకంఠముతో నతని కిట్లనియె. 'ఓ రాజా ! నీకు నా యం దనురాగముజనించిన జనింపవచ్చును. మానవస్వభా నము నెవరు కాదనఁగలరు ! కాని, మాతండ్రి నన్ను నీ కీయనని స్పష్టముగాఁ జెప్పినను, నాకు నీయం దనురాగము లేనట్లు నీపరిచారిక యగురూపవతివలనఁ దెలిసియున్నను విముఖుఁడవు కాక మొండి పట్టుపట్టి మోసపుచ్చి నన్ను గొనివచ్చుట నీ కెంతమాత్రమును దగదు. నీవు నాయస్త్ర