పుట:Ecchini-Kumari1919.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 19

109


తాడనములు మూకుఁ బూలబంతి దెబ్బలవ లె నుండునని తోఁచి నచో మీ రే యామె కుప దేశము చేసి యాభాగ్యము నొం దుఁడు.జన్మము కృతార్థతనొందించుకొనుఁడు' అని చెప్పెను,

భీముఁ డప్పు డా రాజకుమారిని గొంచెము సమీపించి 'యువతీ ! నీ మృదుపాదముతో నీదీనురాలినిగాక నన్నే తన్ని నచో నెంతో యానందింతును గదా ! ఎంతో కృతార్థుఁడ 'సగుదును గదా ! నిన్ను మోసపుచ్చి తెచ్చుట చేఁ గృతాప రాధుఁడ నగు నాగుండెలపై ఁ దన్నుము. నీ బాహు పాశముల చే బంధింపుము. నీకడగంటి చూపులను తూపులచే నాహృదయ మును జీల్పుము. పాప మేమియు నెఱుఁగని రూపవతిని దన్ని తి వేల ! సుందరీ ! చిర కాలమునుండి నీ సౌందర్యమునుగూర్చి వినుచు నీ సుందర రూపమును జూడ లేకపోవుటచే నెడ తెగని తాపముఁ జెందుచుఁ గాలమును గడుపుచుండ నీయస్త్ర విద్యా నై పుణ్యమును దెలుపు నీ బాణము కంటఁ బడినది. అప్పటి నుండియు నామనస్సు చెందుచున్నసం తాపమున కంతము లేదు. నా కస్త్ర విద్యయందుఁ బ్రీతి హెచ్చు. దాని నభ్యసిం చిన వారియందు నా కెంతో గౌరవము. ఇట్లుండఁ, బవిత్రమగు పరమారువంశమునఁ బొడమి సౌందర్యమునకును, సద్గుణము లకును నిధానమనై ప్రాయమునఁ జిన్న దానవయ్యు నస్త్ర విద్యాభ్యాసమునందు-అభ్యాస మన్నఁ జాలదు. అస్త్ర విద్యా చాతుర్యమునందు - అందులోను నావంటి వీరుహృదయము మెప్పొదవించిన చాతుర్యమునందుఁ- పెద్దనై యున్న నీయందు