పుట:Ecchini-Kumari1919.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

8

ఇచ్చి నీ కు మారి

మిగిలియున్నవి. ఆకుండమును గుఱించియు, నాఱాతిని గుఱించియు, భవానీదేవియాలయమును గుఱించియు నొకవింతకథ చెప్పుదురు.

'పూర్వకాలమున నీపర్వతముపై వసిష్ఠమహాముని యాశ్రమ మొకదానిని గల్పించుకొని తపస్సు చేసికొనుచుండెను. అతని హోమధేను వొకనాఁ డాకుండముతీరమునఁ బచ్చిక మేయుచు జాఱి దానిలోఁ బడెను. అప్పటి కాకుండములో నీరు లేదు. అగాధ మగు నాగోతిలోనుండి యాయావు వెడలి రాలేకపోయెను.

వసిష్ఠుఁ డైన నాగోవు నుద్ధరించుటకు సమర్థుఁడు కాక భక్తవత్సలుఁ డగు శంకరునిఁ బ్రార్థింప నతఁడు తనజటాజూటమం దున్నగంగాజలముతో నాకుండమును నిండించి యాగోవు నందుండి పైకి రప్పించెను, అందులకు వసిష్ఠుఁడు సంతసించి యాకుండమువలన మరల నెప్పుడైన నట్టియాపద సంభవించు నేమో యని భయపడి యాకుండమును బూడ్చవలయునని యీశ్వరునిఁ బ్రార్థించెను. అతఁ డామునికోర్కిని దీర్చుటకై హిమవంతునికుమారులలో నొకనిఁ బిలిచి యా కుండమును బూడ్చి వేయ నాజ్ఞాపింపఁగా వారిలో గడగొట్టువాఁ డీశ్వరాజ్ఞను శిరసావహించి యందులో దుమికెను. కాని, వాఁడు చిన్నవాఁ డగుటచే నాకుండమును బూర్తిగాఁ గప్పలేకపోయెను. ఆచిన్నకొండయే యాకుండమున ద్వీపము