పుట:Ecchini-Kumari1919.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ఇచ్చినీ కు మారి


టామె కెఱుఁగమిచే నేనంలో పురుషుఁడు నచ్చుచున్నాఁ డని తలంచి దాసి నడుగఁగా నంహిలపుర భీమ దేవుఁ డతఁడే యని యది తెలిపెను, ఆమాట వినగానే యారాకుమారికిఁ గలవర పాటు హెచ్చయ్యెను, గాలి తాకునఁగదలు తీగేవ లెను, వాటిన వీణాతంత్రివడువునను నొకమాటామె కంప మొందెను. భీముని వెర్రితన మిదివరలో వినియుండుట చే నాఁ డతనివలనఁ దన గౌరవమున కెక్కడ భంగముగల్గునోయని మిక్కిలి పరి తపింపఁ దొడగెను. అయిన నామె యొక్కంచుక ధైర్యమును జక్క ఒట్టి "మేల్ముసుఁగును సవరించుకొని వకుళను మాటు గొని యుండెను,

అంతట రూపవతీయు, భీముఁడును నచ్చటికి వచ్చిరి. భీముఁ డచట నున్న స్ఫటిక శిలా వేదిక పై నుపవిష్టుఁ డయ్యెను. రూపవతీ యుతని చెంత నిలువఁబడి యిచ్ఛినీకుమా రిని గొనివచ్చుట గుఱించి మనవి చేసికొనుచుండెను. భీముఁ డా మెమాటలను వినుచున్నట్లు నటించు చుండెను. కాని, యవి యతని చెవిని బడ లేదు. అతనిమనస్సు చూపులతోఁ గూడ బోయి వకుళ చాటుననున్న యిచ్ఛిని పై విహరించుచుండ దానిమాట లెట్లు వినఁగలఁడు ? రూపవతి యిఁకఁ దనప్రసం గము. కట్టి పెట్టి యిచ్ఛినీకుమారి చెంతకుఁ బోయి "యెదుట మోకరించి 'అమ్మా ! భీమ దేవుఁడు వచ్చి నీకరుణా కటాక్ష లేశము నొంద వేచియున్నాడు. పరిపూర్ణ చంద్రబింబ మఃను మేఘమండలమున లె నీసుందర వదనము నావరించియున్న