పుట:Ecchini-Kumari1919.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్చనీ

104

కుమారి


మార్గవ్యయమునకు నాకు ధనము కొంచెము కావలసి యున్నది. మారాణిగా రిక్కడ లేరు. నీకు ధనము దారవోయువా రెవ రున్నారు ? పో పొమ్ము' అని పలుకునంతలో నిచ్ఛినీ దేవి యచ్చటికి వచ్చెను. ఆమె యాబిచ్చగానిని జూడఁగా నే యా మేముఖమున వికాస మంకురిం చెను. ఆమె సంతోషవికా రము లేమియుఁ బై కిఁదోఁపనీయక దాసిని జూచి 'ఓసీ ! యింటికి వచ్చిన యాచకున కొక కాసైన నియ్యకుండఁ దఱిమి వేయఁ జూచుచున్నావా? మీ ప్రభువుగారు మీ కిట్టి హితోప దేశముఁ జేసినారా యేమి ? ఇంతధనము, ఇంత రాజ్యము, ఇంత లేసి సంపదలును నొకబిచ్చగాని కింతో యంతో యిచ్చినంత మాతమున నే వట్టిపోవునా ? ఐశ్వర్యమునకుఁ బుట్టినింటిన లె నున్న యీ దివ్యభవనమునకు వచ్చినయాచకుఁడు విఫలమనో రథుఁడై పోయినచో నిఁక నంతకన్న శోచనీయ మేమి ? అని తన యింటనున్న యాభరణము నొక దానిని దీసి యాబిచ్చ గాని కిచ్చి 'అయ్యా ! దీనితో సతీర్థయాత చేసికొనిరండు. మరలివచ్చునపుడు నాకు దర్శన మొసంగుఁడు.మీరు మహానుభావులవలె నున్నారు. మీ వంటివారిదర్శనము మాకు సకలఫలప్రదాయి యగును' అని పల్కెను.

ఆ రాజకుమారి దయతోనిచ్చిన యాబహుమాన మతి వినయముతో నందుకొని కనుల కద్దుకొని యామెను బరిపరి విధముల దీవించుచు వెడలిపోయెను. చుట్టునున్న దాసీజన మా మెయు దారబుద్ధిని, దీన వాత్సల్యమునకును మిక్కిలి