పుట:Ecchini-Kumari1919.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 18

103


శక్య నాధ్వని మఱింత దగ్గజగా స్పష్టాక్షరములతో వినిపించెను, . అది యీకింది శ్లోకము,

 శో, నమాతుం మే నయనయుగ మాళీకరతలై
స్తనుజ్యోత్స్నా చేయం విఘటయతి గాఢాంధతమసం
సఖినా మాహూతిం రచయతి చ మే గంధనిషహః
రుదంతీం తాం మాతా హసిత వదనా చుంబతి ముఖం.

సీతా దేవి బాల్యమును వర్ణించు నీశ్లోక మానెనమె చెవిని బడినప్పు డిచ్ఛినీ దేవికిఁ గల్గినయానందమునకు మేర లేదు, ఆమె కాశ్లోక మనఁ బ్రాణముకంటెను బ్రియతమమైనది. ఇంట నుండునప్పుడు తుచుగా దాని నే చదువుచుండెడిది. ఆమె దాసీజనమును జూచి 'ఆపాడెడివారెవ్వరు ?" అని యడుగఁగా వాండ్రు 'అమ్మా ! ఎవ్వండో బిచ్చగాడై యుండును' అని చెప్పి యటనుండి వెడలిపొమ్మని కేక వేసిరి. ఆబిచ్చగాఁ డట్లు చేయక యింకను నాశ్లోకము నే పఠింప జొచ్చెను.

అతని కంఠధ్వనికి సౌధములు ప్రతిధ్వనులిచ్చుచుండెను, ఇచ్ఛినీకుమారి కాక ంఠస్వరము పరిచితమైన ట్లుండుట చే న దెవ్వరిదై యుండును ? అని యాలోచించుచున్న సమయమున నొక దాసి బిచ్చగానితో 'ఓరీ ! ఎందుల క ట్లఱచుచున్నావు? ఇక్కడ నీకు బిచ్చము పెట్టువా రెవ్వరును లేరు. కందాకొట్టు దగ్గజుకుఁ బొమ్ము' అని చెప్పెను. అది విని వాఁడు 'అమ్మా! 'నే బిచ్చమునకు రాలేదు. నేను' గాశికిఁ బోవుచున్నాను,