పుట:Dvipada-basavapuraanamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

బసవపురాణము

తనతొంటిభావంబుఁ దాల్చినయట్టు
లనిమిషుఁ డై కన్నులారఁ జూచుచును
భక్తిశృంగార మేర్పడఁ జూఱగొన్న
భక్తికళార్ణవు బసవయ్యఁ జూచి
“యిట్టిధన్యుఁడ నౌదునే యిప్పు" డనుచు
దట్టుఁడు, బలదేవదండనాయకుఁడు
తనకూఁతుఁ గామినీజనతిలకంబు
ననుపమశృంగారవనధి గంగాంబఁ
దో డ్తెచ్చి యట్ల భక్తులకు మ్రొక్కించి,
యేడ్తెఱ శుభచేష్ట లెదురుకొనంగ 1100
శివభక్తవనితలు సేసలు సల్ల
శివబలం బగ్గలించినముహూర్తమున
వేదో క్తశివధర్మవిధి బసవనికి
గాదిలిసుత : బెండ్లి గావించె ; నంత
“నట్టిద కాదె ము న్నాదిఁ దలంపు
నిట్టట్టు నావల దిదియె పథంబు
హరునిభక్తులబలం బది లేమిఁ గలిమి
హరివిరించులు ద్రుంగుదురు [1]మండు రనినఁ
దక్కినగ్రహచంద్రతారాబలముల
యెక్కువదక్కువ లెన్న నేమిటికిఁ ? 1110
గరుణఁ జూచుటయ లగ్నంబు సేయుటయు
వరముహూర్తంబు దీవనయ బలంబు
గాన భక్తులకృప గలదు బసవని
కేనాఁట విందుమే యిట్టిపెండ్లిండ్లు"
ననుచు లోకంబెల్ల నాశ్చర్య మంది
వినుతింపఁ జొచ్చిరి వీరు వా రనక .

  1. బ్రదుకుదురు.