పుట:Dvipada-basavapuraanamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

39

నలిరేఁగి వేణువీణావాద్యవితతు
లులియుచు లీలతో నొక్కట మ్రోయ
నానందగీతంబు లగ్గించువారు,
పూని శంకరగీతములు వాడువారు,
జతిగీతములమీఁదఁ జప్పట లిడుచు
నతిశయశివభక్తి నాడెడువారు,
నాదిపురాతనాపాదితస్తుతులు
వేదార్థములు గాఁగ వివరించువారు,
నెఱి శివమరులున గుఱిలేనివేడ్క
నఱిముఱి మిన్నంది యాడెడువారు , 1070
మ్రొక్కి శివానందమునఁ దమ్ము మఱచి
నిక్కపుసుఖమున నిద్రించువారు,
నిఖిలమాహేశ్వరనికరంబు నిట్లు
సుఖలీలఁ గొలువున్నచో బసవయ్య
యప్పాదజలముల నభిషి క్తుఁ డగుచు
నొప్పుదివ్యాంబరయుగ్మంబు సాతి
భసితంపునెఱపూఁత పలుచఁగాఁ బూసి,
నొసలఁ ద్రిపుండ్ర మొ ప్పెసఁగ ధరించి,
మౌళిఁ బ్రసాదసుమంబులు దుఱిమి,
పోలఁగ రుద్రాక్షభూషలు దాల్చి, 1080
సారమై లింగపసాయితం బనెడు
పేరను గల్గుకఠారంబు గట్టి,
యానందబాష్పంబు లలుఁగులు వాఱ
మేను రోమాంచసమ్మిళిత మై తనర
“బగుతులపాదుకా ప్రతతులు నాకు
నగపడె” నంచు నందంద మ్రొక్కుచును
నొడయల కడుగులు వొడసూప నోడి
మడఁచి వెన్కకు డాఁచి మహి నప్పళించి
యూరుల మోఁచేతు లూఁది కేల్మొగిచి
వారక యొక్కింత వంగి యుప్పొంగి 1090