పుట:Dvipada-basavapuraanamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

బసవపురాణము

బుట్టినాఁడ కులము పురులు వోనాడ
నెట్టయ్య : తలఁచెదు పట్టి మాయయ్య !
కులదీపకుఁడు పుట్టఁ గులము వర్ధిల్లుఁ ;
గులనాపకుఁడు పుట్టఁ గులమెల్లఁ ద్రుంగుఁ ;
గులమున కెల్లను గుద్దలిఁ గొంటి
వెలి సేయరే నన్ను విప్రులు విన్న ? 920
నిన్నుఁ జేపట్టి యనీతిమైఁ గులము
చెన్నఁటి ! పోనాడి చెడ నెట్లు వచ్చు ?
యుక్తి సెప్పితి మిప్పు డొల్లవై తేని
భక్తియు నీవును బడ్డట్లు పడుము...."
అని నిష్ఠురోక్తుల నందంద పలుక
విని పొంగి బసవఁ డి ట్లనియెఁ గోపమున :
“బ్రాహ్మ్యంబు భక్తియుఁ బలికెదు కూడ
బ్రాహ్మ్యంబు వేఱెదర్శన మయియుండు ;
వేఱెదైవంబును, వేఱె మంత్రంబు,
వేఱె యాచార్యుండు. వేఱె వేషంబు, 930
ధ్యానంబు వేఱె, బ్రాహ్మ్యక్రియ ల్వేఱె ,
మానుగా నాచార్యమార్గంబు వేఱె ;
కాదేని నగ్నిముఖము, బ్రహ్మశిరము,
నాదిరుద్రుఁడు శిఖ, హరి యుదరంబు ,
ప్రాణాదివాయువు ల్ప్రాణంబు , యోని
క్షోణి, దా శ్వేతంబు సూవె వర్ణంబు,
నసమాక్షువిధమె గాయత్రి! సాంఖ్యాయ
నసగోత్ర, మిరువదినా ల్గక్షరములు
దానికి, మఱి త్రిపాదంబు. షట్కుక్షి.
పాన లొండును గావు పంచశీర్షంబు 940
నని చెప్పుఁగాదె మీయాజ్ఞికంబులును ;
వినుము దైవం బది వే ఱౌనొ కాదొ ?
కావున నిదియు సాంఖ్యాయనమతము