పుట:Dvipada-basavapuraanamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33

గావింపఁగా రాదు కథ లేమి చెప్ప ?"
ననవుఁడు దండ్రి యి ట్లనియెఁ బుత్త్రునికి :
“వినవయ్య ! బసవయ్య : విప్రమార్గంబు
నాగమవిధిఁ బదునాఱుకర్మంబు
లాగర్భసంస్కార మాదిగాఁ గలవు ; 890
వానిలో నొకఁడైన నూన మౌనేని
కానేరఁ డాతఁ డగ్రకులోత్తముండు ;
అందు విరుద్ధ మెయ్యది ? రుద్రగణము
నాంది ముఖ్యం బుపనయనపూజకును
బనుగొనఁ బ్రణవంబు భర్గుఁడే దైవ
మనుటయు మంత్రంబు ; నట్లును గాక
పెట్టినసూత్రముల్ భీమసర్పములు,
పట్టినపాత్రంబు బ్రహ్మశిరంబు ,
పాలాశడండంబు వంకజోదరుని
కో లేమ్ము, దలచుట్టుకూఁకటుల్ జడలు . 900
నఱితికృష్ణాజిన మది గజాజినము,
వఱలు మేదావియే నెఱిభూతి గాఁగ
హరుఁడు భిక్షాటన మాచరింపంగ
నరిగినవేష మింపారఁ దాల్చినను
నట్టైనఁ గాని బ్రాహ్మణుఁడు గాఁ డనిన
నిట్టు విరుద్ధమే యీశుభక్తునకు ?
వడుగు చేసిన భక్తి వట్టిపా టగునె ?
నొడువరితనమునఁ గడవ నాడెదవు.
పసిబిడ్డమాటలు పనియు లే దింక
మసలక చేయుమీ మాచెప్పినంత ; 910
యిట్టిచోద్యంబు లే మెఱుఁగ మేనాఁటఁ ;
బట్టి మాకడుపునఁ బుట్టితికాక
'ప్రాలు గల్గుసుపుత్త్రుఁ బడసితి మింక
మేలయ్యె' నని యేము లీల నున్నెడను