పుట:Dvipada-basavapuraanamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

బసవపురాణము

పదవులు గిదవులు పనిలేదు ; నీదు
సదమలభక్తిఁ బ్రసాదింపు దేవ ! " 470
యనిన గాఢాలింగనావలి నతని
తనువు నాతనువునఁ బెనఁగొల్పి యంత
“భవదీయగాత్రసంస్పర్శన సుఖము
నవక మెక్కఁగ వాహనం బగు మిట్లు
ఆది మదీయవాహనమవు నీవు
వేదాంతనుత ! మహావృషభేంద్ర !" యనుచుఁ
బ్రమథేంద్రపదవికిఁ బట్టంబు గట్టి
యమిత సర్వజ్ఞత్వ మప్పు డిచ్చుడును.--
నంతట శ్రీధరుఁ డంతట నజుఁడు
నంతట దేవేంద్రుఁ డంతట సురలు 480
ధరఁ జాఁగఁబడి మ్రొక్కి కరములు మొగిచి
శర ణంచు నందికేశ్వరునిఁ గీర్తింప
నతఁడు దయామతి నల్లన నగుచు
[1]నతగులౌ సురలను నరవిరికంటఁ
జూచె భయంపడు సురలుఁ దొల్లొంటి
యేచిన భీతివోఁ జూచినయట్లు ;
శ్రీగిరినై రృత్యభాగంబు పుణ్య
భాగ మాక్షేత్రంబు పరమపావనము.
నందికేశ్వరుని పుణ్యతపంబుచేత
'నందిమండల' మను నామంబుఁ దాల్చె ; 490
నచట వర్తించు నఖిలజీవులకు
నిచ్చితి నపవర్గ మిందీవరాక్షి !
దొరకొను నందికేశ్వరుచరితంబు
విరచించువారికి విన్నవారికిని
నచలితబుద్ధి దృష్టాదృష్టసిద్ధి
ప్రచురవచశ్శుద్ధి భక్తిసమృద్ధి

  1. అల్పు లు, దుర్బలులు.