పుట:Dvipada-basavapuraanamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17

భ్రాంతిఁ బొందిన వెఱ్ఱిపశుజీవులార ! 440
నందీశ్వరుఁడు సేయు నవ్యతపంబు
చందంబు సూచియో శంకించి రాక ;
చీరికిఁ గైకొన్నె శ్రీప ! నీపదవి ;
కోరునే బ్రహ్మ : నీ కొండికపదవి ;
ఓరి దేవేంద్ర ! నీ యొడఁబడుపదవి
పేరతఁ డెఱుఁగునే పెక్కు లేమిటికి ?
ననుఁగాని యాతండు నాపదం బైన
మనమునఁ దలఁపడు మాభక్తులాన"
యనుచుఁ బ్రసన్నుండ నై యేను వారి
మనముల దిగులెల్ల మాన్పంగఁ దలఁచి 450
యందఱుఁ గొలిచిరా నచటికిఁ బోయి
నందికేశ్వరు డాయ ముందట నున్న
నతఁ డంతరంగంబునందు నన్ గాంచు
గతి దేటతెల్ల యై కానవచ్చుటయు
నప్పు డచ్చెరువుఁ బ్రహర్షంబు భక్తి
ముప్పిరి గొని మనంబున నుల్లసిల్ల
సాష్టాంగ మెఱ గి మదంఘ్రికంజములు
హృష్టుఁ డై నెన్నుదు రిఱియంగ మ్రొక్కి
యానందబాష్పపూర్ణాస్యుఁ డై కలయ
మేనురోమాంచసమ్మిళితమై తనర 460
గద్గదకంఠుఁ డై కరములు మొగిచి
తద్గతచిత్తుఁ డై తాఁ బ్రస్తుతింప
“మెచ్చితి వరము నీ కిచ్చితి వేఁడు
మిచ్చ యెయ్యది నందికేశ్వర !" యనిన
దరహాసకాంతి వక్త్రమునఁ దుల్కాడ
నరుదొంద మాకు ని ట్లని విన్నవించెఁ ;
“బెన్నిధి యుండఁగ మ న్నడుగుదురె ?
ని న్నొండు వేఁడెడు నిర్గుణి గలఁడె ?