Jump to content

పుట:Dvipada-basavapuraanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

నిశ్చయించనైనది. చౌకగా పాఠకులకు అందజేయవలెనను ఉద్దేశముతో ఈ సంపుటాల వెల తక్కువగా నిర్ణయించ నై నది. ఇప్పటివఱకు మొదటి తరగతిలో 29 పుస్తకాలను ప్రకటించి ముద్రించుట జరిగినది. ప్రస్తుతము రెండవ తరగతిలోని పుస్తకాల ప్రకటన ప్రారంభమైనది. మేము కోరినంతనే యీ సంపుటము సిద్ధముచేయు బాధ్యతను స్వీకరించి నిర్ణయించిన గడువులోపల వ్రాతప్రతిని అందజేసిన శ్రీ జి. వి. సుబ్రహ్మణ్యముగారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతలు. ఈ తరగతిలోని మిగిలి పుస్తకాలు ఈ సంవత్సరాంతము వరకు ముద్రితము కాగలవని ఆశించుచున్నాను.

ఈ ప్రణాళికను అమలుచేసి వ్రాతప్రతులను సిద్ధముగావించి ముద్రించుటకు కావలసినడబ్బు మొత్తము అకాడమీకి యిచ్చుటకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాగ్దానము గావించి యిప్పటివఱకు కొంత డబ్బునుగూడ విడుదల చేసినవి. ఇందుకు అకాడమీ పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. నిర్ణయించిన గడువులోపల ఈ సంపుటా లన్నిటిని ప్రకటించి ఆంధ్ర పాఠకలోకానికి అందజేయగల మని విశ్వసించు చున్నాను.

హైదరాబాదు

6 - 1 -1969

దేవులపల్లి రామానుజరావు,

కార్యదర్శి.


____________