పుట:Dvipada-basavapuraanamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

3

భాసురచరలింగపటుదీప్తిఁ బరగు
నాకాలకంధరు ననవద్యహృద్య
సాకారవిభ్రమవ్యాప్తిఁ బెంపారు 50
నా దేవువీరవ్రతాచారసార
మేదురస్ఫురణమై మించి వెలుంగు
జంగమరత్నంబు శకణసమ్మతుఁడు
లింగైక్యవర్తి గతాంగవికారి
పండితారాధ్య కృపాసముద్గతుఁడు
మండితసద్భక్తిమార్గ ప్రచారి
విలసితపరమ సంవిత్సుఖాంభోధి
నలిఁ గరస్థలి సోనునాథయ్యగారు ;
బసవనికారుణ్యరససుధావార్థి
నసదృశలీల నోలాడుచు నిత్య 60
నియమవ్రతాచార నిరుపమనిష్ఠ
క్రియగొనఁ దత్త్వనిర్ణయము సంధిల్ల
నతులగోష్ఠీ సుఖస్థితిఁ బేర్చుభక్తి
మతినియమంబుల మల్లినాథుఁడును ;
నాదివేదాంతసిద్ధాంతపురాణ
వేదశాస్త్రాగమవిహితమార్గములఁ
దనుమనోధననివేదనసమగ్రతయుఁ
బనుగొన జంగమార్చనలు సేయుచును
నోలిమై [1] గ్రామసీమాలంఘనవ్ర
తాలంకృతిని బేర్చి యాచారలీల 70
యసలారఁగాఁ గుమారాద్రికిఁ దూర్పు
దెసను సోపానముల్ దీర్చి పొల్పార
మహితసద్భక్తి సమంచితవృత్తి

  1. తానుండు గ్రామముయొక్క పొలిమేరను దాఁటి చరింపక, యున్న గ్రామమునందే నిత్యము తన యాచారవిధుల నిర్వహించుట. ఇది వీర శైవుల చతుష్షష్ట శీలములలో నొకటి.