పుట:Dvipada-basavapuraanamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

బసవపురాణము

మన్మనోరమ్యు . నిర్మలభావగమ్యు ,
జిన్మయు. సౌమ్యు భజించి, కీర్తించి ; 20
యుల్లమున మదీయవల్లభుఁ జెన్న
మల్లికార్జునదేవుఁ దెల్లగా నిలిపి ;
సముదితసారూప్యశాశ్వతతనులఁ
బ్రమథులఁ ద్రిభువన ప్రథములఁ దలఁచి ;
ప్రకటలింగైక్య పురాతనభ క్త
నికరంబు శివునంద నిష్ఠించి కాంచి ;
వ్య క్తలింగముల సద్భక్తిరసాభి
షిక్తుల నూతనభ క్తులఁ దలఁచి ;
బసవచరిత్ర యివ్వసుమతి మీఁదఁ
బసరింతుఁ దత్కథా ప్రౌఢి యె ట్లనిన : 30
శ్రీమన్మహా దేవుసింహాసనంబు ,
హైమవతీశువిహారస్థలంబు,
హరునిభక్తులకు నేకాంతవాసంబు,
పరమయోగులకు హృత్ప్రమదావహంబు ,
నరులకుఁ గర్మసంహరణైకహేతు,
వరయంగ సురలకు నాశ్రమభూమి.
సకలతీర్థములకు జనయిత్రి యగుచు;
బ్రకటింప నొప్పు శ్రీపర్వతేంద్రంబు ;
ఉర్విఁ దత్పర్వతసార్వభౌమునకుఁ
బూర్వవక్త్రాంకవిస్ఫురణ దొల్కాడ 40
నొలసి కుమారశైలోత్తంసలీలఁ
దిలకించి పెంపారుఁ ద్రిపురాంతకంబు ;
తత్త్రిపురాంతక స్థానవాస్తవ్యుఁ
డై త్రిపురాంతకుం డభినుతిఁ బేర్చు;
నాపురసంహారు నపరావతార
రూపితఖ్యాతినిరూఢిఁ దలిర్చు:
నాసదాశివమూర్తి యవితథైశ్వర్య