పుట:Dvipada-basavapuraanamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

బసవపురాణము

ప్రథమాశ్వాసము

అవతారిక

శ్రీ గురుదేవు సంచితగుణో త్తంసు,
యోగీంద్రహృదయపయోజాతహంసుఁ ,
బరమకృపామూర్తి. భక్తజనార్తి
హరుఁ, ద్రిజగత్స్ఫూర్తి, నానందవర్తి,
భవరోగవిచ్ఛేది. భక్తవినోది,
శివతత్త్వసంపాదిఁ, జిరతరామోది,
నిత్యస్వరూపు, నున్మీలత్ప్రతాపుఁ ,
బ్రత్యయగతపాపు, భక్తప్రదీపు.
భావనాతీతు, సద్భావనో పేతు,
సావయవఖ్యాతు, నమితు, నజాతు, 10
నాద్యంతరహితు, వేదాంతార్థ సుహితు ,
విద్యాత్మ సహితు, సంవిత్సౌఖ్యమహితు.
భక్తపరాధీను , భక్తనిధాను,
భక్తసమాధాను, భక్తావధాను,
భక్తపరంజ్యోతి. భక్తవిభూతి.
భక్తదుఃఖారాతి. భక్తానుభూతి,
భక్తప్రజత్రాణు, భక్తధురీణు ,
భక్తజనప్రాణుఁ, బరమకళ్యాణు.