పుట:Dvipada-basavapuraanamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxi

ప్రాసవడి :

సోమనాథుఁడు ద్విపదలో వాడిన 'ప్రాసయతి'ని సమర్థించు శ్రీ బండారు తమ్మయ్యగారి వాక్యములు స్మరింపఁదగినవి : "ఆంధ్రభాషలో సోమనాథుని కాలమునాఁటికి ఛందోవ్యాకరణలక్షణ గ్రంథము లేమైన వెలసినవో లేదో యెవ్వరు నింతవఱకు రూఢిగాఁ జెప్పఁజాలకున్నారు. ఇప్పటి కుపలబ్ధము లైన వానిలోఁ బ్రాచీనము లని మనము గణించు కవిజనాశ్రయము, కావ్యాలంకార చూడామణి, ఆంధ్రశబ్ధ చింతామణి , ఆంధ్రభాషాభూషణము మున్నగునవి యెల్ల సోమునకుఁ దరువాతివే గాని ముందరివి గావు. ద్విపదలలోఁ బ్రాసయతి చెల్లదను లక్షణము సోముని తరువాతఁ జాలఁగాలమునకు వెలసిన చిన్నన్నలు చెప్పినదే కాని యాతనికి ముం దుండిన తొల్లింటి పెద్ద లేర్పరచినది గాదు. కవిజనాశ్రయములో నిందుఁగూర్చి యేమియుఁ జెప్పియుండలేదు. ద్విపదలలోఁ బ్రాసయతి చెల్లుననుటకు సాధకముగ " అనియతగణైః" “యతిర్వా" "ప్రాసోవా” యను ప్రాచీనచ్ఛందస్సూత్రముల నాంధ్రభాషా చ్ఛందోలక్షణములఁ జెప్పుచు సంస్కృతభాషలో రచిత మైన యేఛందో గ్రంథమునుండియో సోమనాథుఁడు పేర్కొనియే యున్నాఁడు. యతిప్రాసనియమము లేని సంస్కృతశ్లోక రచనములకుఁగాని , యతినియమము లేని కర్ణాట పద్యరచనములకుఁగాని యీ సూత్రములు సంబంధించినవి గావని చెప్పనక్కరలేదు. అక్షరగణబద్ధము లై, చతుష్పాదనియతి గల వృత్తములందును, అనియతగణబద్ధము లయ్యుఁ, జతుష్పాదనియతి గల కందము, ఉత్సాహము, అక్కర మున్నగు జాతులందును పాద ద్వితీయాక్షర ప్రాస నియమ మున్నదన్న కారణమునఁ గొఁబోలు వీనిలోఁ బ్రాసయతి పనికి రాదనియుఁ జతుష్పాద నియతిగల్గియుఁ బావద్వితీయాక్షర ప్రాసనియమము లేని సీసము , తేటగీతి, ఆటవెలఁది మున్నగు నుపజాతులందు, సంగీతమునందు నది చెల్లుననియుఁ దలంచు సంప్రదాయ మాంధ్రచ్ఛందోలక్షణ గ్రంథములలో నేర్పడినది. అక్షరగణబద్ధము లై చతుష్పాదనియతి గల లయగ్రాహి, లయహారి , లయవిభాతి, త్రిభంగి మున్నగు కొన్ని వృత్తముల విషయమున మాత్రమందు లయప్రాధాన్య మున్నదన్న కారణమునఁ గాఁబోలు మరల నీ లక్షణ గ్రంథకర్తలు ప్రాసయతినే విధించియున్నారు. ఇవియన్నియు నర్వాచీన లక్షణములే యని తలంపఁదగును, అనియతగణబద్ధ రచనములలోఁ జతుష్పాద నియతితో పాటు పాదద్వితీయాక్షర ప్రాసనియమ మున్న జాతులమాట యెట్లున్నను, ఇట్టి ప్రాస