పుట:Dvipada-basavapuraanamu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

బసవపురాణము

అంతియకాని ని న్నడిగినచోటు
నెంతైన నేమైన నిచ్చినచోటు 830
గలతప్పు సై రించి కాచినచోటు
గలదేని చెప్పుమా ! కానమీయందుఁ
బుట్టిన మొదలును బోఁకయుఁ బొరయ
వట్టికొల్వున నిన్ను ముట్టఁగొల్చితిని ;
వెట్టిచేసిన నీకు వెయ్యేఁడులైన
నెట్టును మేలకా కెగ్గేమి తలఁప ?
నూరకి ట్లనుచుట యుచితమే నీకు ?
నారంగఁ బ్రమథులయాన నీయాన
వృషభవాహన ! విన్నవించుట వినక
వృషభంబు నీ కెట్లు విడువంగ వచ్చు ? 840
నొల్ల నొండేమియు నోటంబు గాదు :
వల్లభ : యడుగను వర మిఁక నిన్నుఁ :
బరమపరానంద పరవశీభూత !
నిరవధితత్త్వ విస్ఫురణ పెంపునను
గతిమనోవాక్కాయ కర్మచై తన్య
రతులు నీయంద విశ్రాంతంబు నొందఁ
జేయుము; నీయాజ్ఞఁ జేసి యేతెంచి
చేయంగఁ గలపను ల్సేసితి నింక ."
ననుడు దయామతి నగ్గురుమూర్తి
తనతొంటి భావంబు దాల్చి యాక్షణమ 850
సంగయదేవుఁడు సదనాంతరంబు
భంగిగా వెడలుడు బసవయ్య సూచి
సన్నుత తద్గురు చరణాబ్జయుగము
నెన్నుదు రిఱియంగ సన్నుతి మ్రొక్కి
యానందబాష్ప సమంచితవార్ధి
తా నిట్టవొడువ గద్గదకంఠ మమర
ముత్పులకలు మేన మొగి నిండ హర్ష